ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క... అంటూ ప్రభాస్ ‘మిర్చి’లో ఓ పవర్ఫుల్ డైలాగ్ చెబుతాడు. కథానాయిక కాజల్ కూడా ఇంచుమించు అదే చెబుతోంది. కాకపోతే ఇక్కడ కాజల్ చెబుతున్నది సినిమా కోసం కాదు, తన కెరీర్ గురించే. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న సీనియర్ కథానాయికల్లో కాజల్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణం కోసం మీరు అనుసరించిన వ్యూహాలు ఎలాంటివి? అని అడిగితే..కథానాయికగా ఇంత దూరం నేను ప్రయాణం చేయాలని, ఇన్నేళ్లు నటిగా కొనసాగాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. అయినా చిత్రసీమలో వ్యూహాలు, ప్రణాళికలు చెల్లుబాటవుతాయంటే నేను నమ్మను. మనం ఒకటి వూహిస్తే, వాస్తవంలో మరోటి జరుగుతుంటుంది. అందుకే తొలినాళ్లల్లో ఇదే నా చివరి సినిమా అనుకొనేదాన్ని. కొన్నాళ్ల తర్వాత కెరీర్పై పట్టు పెరిగింది. వరుసగా అవకాశాలొస్తున్నప్పుడు ఇక దేని గురించీ ఆలోచించే అవసరం రాలేదు. అయితే అంతా సీనియర్ కథానాయిక అని పిలుస్తున్నప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యూహం అంటారో, ఇంకేమంటారో తెలియదు కానీ.. ఇక నుంచి మాత్రం కొత్త లెక్కలతో ప్రయాణం చేయాలనుకొంటున్నా. చేసే ప్రతి పాత్ర నటిగా ఆత్మ సంతృప్తినిచ్చేలా ఉండాలనే ఆలోచనతో సినిమాల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఇదివరకటి పరుగుని ఆపేశా. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది కాజల్
Monday, 3 October 2016
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150 UPDATES
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150 తమిళంలో విజయవంతమైన ‘కత్తి’కి రీమేక్గా రూపొందుతోంది. కాజల్ కథానాయిక. V.V.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. డెబ్బై శాతం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమని మరోమారు రామ్చరణ్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘‘సామాన్యుడి కోసం పోరాటం చేసిన ఓ ఖైదీ కథ ఇది. తమిళంలో ప్రేక్షకుల మెప్పు పొందిన ‘కత్తి’కి మనదైన వాతావరణాన్ని జోడించి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. నాన్న తెరపై కనిపించే విధానం చాలా బాగుంటుంది. ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింది. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని వచ్చే జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు
Subscribe to:
Posts (Atom)